ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గురుకుల కళాశాలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసిన పేరెంట్స్ కమిటీ నాయకులు

రామగుండం,అర్జున్ సమాచారం:
రామగుండం మహిళా గురుకుల పేరెంట్స్ కమిటీ నాయకులు శనివారం  శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి , అడిషనల్ కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ ను కలిసారు.
రామగుండం మహిళా గురుకుల కళాశాలకు నూతనంగా ఎన్నికైన కమిటీ నాయకులు డివిఎంసి మెంబర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం గురుకుల పేరెంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కవ్వంపల్లి సతీష్ తో కలిసి చైర్మన్ కన్నం నవీన, వైస్ చైర్మన్  శైలజ ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి కోశాధికారి రజిత సలహాదారులు దుర్గం ఉషారాణి   మురళి , మాధవి, కార్యదర్శులు ప్రియాంక, శ్రావణి, జ్యోతి, అంజలి, మెంబర్స్ లత అనూష  నాయకులు భాగ్యలక్ష్మి , కన్నం సంపత్, రాజేశ్వరరావు, సంకె సతీష్ తదితరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి, అడిషనల్ కలెక్టర్ కమిషనర్ అరుణ శ్రీ ను కలిసి రామగుండం గురుకుల కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపి గతంలో మీరు సహకారంతో కళాశాలకు మిషన్ భగీరథ వాటర్, రోడ్డు మరమ్మత్తులు, కుట్టు మిషన్లు, వాటర్ ఫ్రిడ్జ్, కళాశాల ఆవరణమంతా చెట్ల వదలను తొలగించి శుభ్రం చేశారని మీరు చేస్తున్న అభివృద్ధికి పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో శాలువా కప్పి  సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తూ  విద్యార్థులకు ఉపాధ్యాయులకు కళాశాలలో మరిన్ని సౌకర్యాలు కావాలని కళాశాలలో ఆర్వో ప్లాంట్, స్టీమ్ మిషన్, కళాశాల అంతట పెయింటింగ్, గోడలు ఎత్తు పెంచడం పూర్తిస్థాయిలో లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మేయర్ అడిషనల్ కలెక్టర్ గార్లను కోరుతూ వినతిపత్రం అందించారు
============================